- సికింద్రాబాద్ రాంనగర్‌లో ఘటన
పద్మారావునగర్, వెలుగు : ఐదేండ్ల కూతురు చూస్తుండగానే తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో ఆదివారం జరిగింది. రాంనగర్ చిన్న చౌరస్తా పక్క వీధిలో ఉండే మచ్చ శ్రీకాంత్ (32) జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, ఐదేండ్ల కూతురు ఉంది.
శ్రీకాంత్రోజూ మద్యం తాగి వస్తుండడంతో భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో శ్రీకాంత్‌తో పాటు అతడి భార్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శ్రీకాంత్ భార్య ఆదివారం డ్యూటీకి వెళ్లింది. ఈ టైంలో శ్రీకాంత్ ఉరి వేసుకున్నాడు. పాప వెంటనే పక్కింట్లోకి వెళ్లి విషయం చెప్పింది. వారు వచ్చి శ్రీకాంత్‌ను గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు వారాసిగూడ ఎస్సై సుధాకర్ చెప్పారు.