అన్యాయంగా నా కొడుకును జైల్లో పెట్టిన్రు.. ఖురాన్​ నెత్తిన పెట్టుకొని ఏడ్చిండు

నిజామాబాద్/ బోధన్, వెలుగు: ఎమ్మెల్యే షకీల్​పై మర్డర్​అటెంప్ట్​కేసులో అన్యాయంగా తన కొడుకు అల్తాఫ్​ను ఇరికించి జైళ్లో పెట్టారని అతడి తండ్రి అబ్దుల్​బాకీ గురువారం కన్నీరు పెట్టుకున్నారు.  తన కొడుక్కి ఏ పాపం తెలియదని ఖురాన్​ నెత్తిన పెట్టుకొని ఏడ్చారు.  బక్రీద్​ సందర్భంగా నిజామాబాద్​ జిల్లా బోధన్​పట్టణ శివారులోని దర్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్​చేస్తున్నారు.  నమాజ్​ ముగిసిన తర్వాత వేదికపైకి ఖురాన్​తో వచ్చిన బాకీ, మైక్​ఎదుట బోరున విలపించారు. ఆ సమయంలో దర్గా వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ ప్రేమ్​కుమార్​దగ్గర్లోనే  ఉన్నారు. కన్నీరు పెడ్తున్న అబ్దుల్​బాకీని తోటి ముస్లింలు ఓదార్చి పక్కకు తీసుకెళ్లారు. హత్యాయత్నం కేసు ఎదుర్కొంటూ, అజ్ఞాతంలో ఉన్న బీఆర్ఎస్​వార్డు కౌన్సిలర్ ​మీర్​నజీర్​అలీ వీడియో విడుదల చేశారు. పండగ వేళ చేయని తప్పుకు ఫ్యామిలీకి దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. డెవలప్​మెంట్​గురించి ప్రశ్నించిన తమపై ఎమ్మెల్యే షకీల్​హత్యాయత్నం కేసులు పెట్టించారని, ఆయన్ను ఓడించి గుణపాఠం చెప్తామన్నారు.