మరికొన్ని గంటల్లో కొడుకు పెండ్లి.. ప్రమాదంలో తండ్రి మృతి

మరికొన్ని గంటల్లో కొడుకు పెండ్లి.. ప్రమాదంలో తండ్రి మృతి

తొగుట, వెలుగు: మరికొన్ని గంటల్లో కొడుకు పెండ్లి జరగాల్సి ఉండగా, ఈ లోగానే ప్రమాదంలో తండ్రి చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్‌‌‌‌ మండలం మంతూర్‌‌‌‌లో జరిగింది. మంతూర్‌‌‌‌కు చెందిన కాశీం అలీ (73) ఫ్యామిలీతో కలిసి ప్రజ్ఞాపూర్‌‌‌‌లో ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం గజ్వేల్‌‌‌‌లో తన చిన్న కొడుకు పెండ్లి జరుగుతుండడంతో మంతూరులోని బంధువులకు చెప్పేందుకు కారులో భార్య జహారా, పెద్ద కొడుకు యాసిన్‌‌‌‌తో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో వెంకట్రావుపేట శివారులోకి రాగానే అడవిపంది అడ్డురావడంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

విషయం తెలుసుకున్న తొగుట ఎస్సై రమాకాంత్‌‌‌‌రావు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని గజ్వేల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ కాశీం అలీ చనిపోయాడు. అప్పటివరకు పెండ్లితో సంతోషంగా ఉన్న కుటుంబంలో తండ్రి మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. యాసిన్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.