అయ్యో పాపం.. నాన్న 60, కొడుకు 28.. ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు..

అయ్యో పాపం.. నాన్న 60, కొడుకు 28.. ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు..

ఎదిగొచ్చిన కొడుకు.. భవిష్యత్తుకు కొండంత భరోసా.. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు అనుకున్న తండ్రికి..  ఇక ఆ కొడుకు లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోయాడు. కొడుకు గుండె పోటుతో మృతి చెందడంతో.. ఆ బాధను తట్టుకోలేక 24 గంటల వ్యవధిలోనే తండ్రి కూడా గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా చాగలమర్రిలో జరిగింది విషాద ఘటన.

వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా చాగలమర్రి కోటగడ్డ వీధికి చెందిన ముల్తా జహంగీర్‌ (60)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు.  కొడుకు ముల్లా రబ్బాని (28) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు.  బుధవారం ఒక్కసారిగా  గుండెపోటుతో రబ్బాని ప్రాణాలు విడిచాడు.  కొడుకు మృతితో తండ్రి జహంగీర్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. 

అప్పటిదాకా స్నేహితులతో బాగానే ఉన్న రబ్బాని ఉన్నట్టు ఉండి ఒక్క సారిగా కుప్ప కూలి గుండె పోటుతో మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన కొడుకు మరణ వార్త విని రోజంతా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు జహంగీర్. కొడుకు మృతిని జీర్ణించుకోలేక గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.


కొడుకు చనిపోయిన 24గంటల్లోనే గుండె పోటు తో తండ్రి మృతి చెందడంతో  వారి కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.