
సుల్తానాబాద్, వెలుగు : కూతురు తనకు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. జూలపల్లి ఎస్సై సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎండీ. అజ్గర్ పాషా(43) ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో లష్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి చిన్న కూతురు సల్మా, జూలపల్లికే చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు.
తల్లిదండ్రులకు చెప్పకుండా మార్చి 27న వీరిద్దరూ పెండ్లి చేసుకున్నారు. విషయం తెలియడంతో మనస్తాపానికి గురైన అజ్గర్ పాషా ఈ నెల 6న ఉదయం పొలం వద్ద గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుండి వరంగల్ ఎంజీఎం తీసుకువెళ్లగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.