
పెంబి, వెలుగు: విద్యుత్ షాక్ తో తండ్రి చనిపోగా, కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకా రం.. నిర్మల్ జిల్లా పెంబి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన రాపెల్లి మైసయ్య(42) కొంత భూమి కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు.
పంటలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న కొడుకు రాపెల్లి మహేశ్(20) తండ్రిని కాపాడబోయి అతను కూడా షాక్ కు గురయ్యాడు. తండ్రి అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయలైన మహేశ్‌ను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.