- చికిత్స పొందుతూ మృతి
ఇబ్రహీంపట్నం, వెలుగు: కొడుకు మరణం తట్టుకోలేక పురుగుల మందు తాగిన వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. తుక్కుగూడ మున్సిపాలిటీ మంఖాల గ్రామానికి చెందిన బాకి మహేందర్అలియాస్మహిపాల్(35) కు 3 నెలల కొడుకు ఉన్నాడు. ఈ నెల 11న ఆ బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధను తట్టుకోలేక మహిపాల్ కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగాడు. దీంతో బాధితుడిని వెంటనే కుటుంబసభ్యులు మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ బుధవారం ఉదయం మహిపాల్ (35) మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.