భిక్కనూరు, వెలుగు : కొడుకు పుట్టిన కొద్ది గంటలకే తండ్రి సూసైడ్ చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు చెందిన చిగుళ్ల మధు (23) రెండేండ్ల కింద పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కృష్ణవేణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కామారెడ్డిలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో కృష్ణవేణికి మగబిడ్డ పుట్టాడు.
తర్వాత సాయంత్రం మధు, కృష్ణవేణి మధ్య గొడవ జరగడంతో మధు చిన్నారిని తీసుకొని వెళ్తానని పట్టుబట్టాడు. ఇరు కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో మధు భిక్కనూరు వెళ్లిపోయాడు. ఇంట్లో అందరూ నిద్రపోయిన టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.