- కండ్లలో కారం చల్లి, కత్తితో నరికిన నిందితుడు
- మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో దారుణం
మనోహరాబాద్, వెలుగు : నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తుండడంతో భరించలేక ఓ వ్యక్తి తన కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్‌లో శుక్రవారం జరిగింది. సీఐ రంగా కృష్ణ, ఎస్సై సుభాశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్ (30) రోజూ మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడంతో పాటు, డబ్బులు ఇవ్వాలంటూ వేధించేవాడు.
గురువారం కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో గొడవ పడి, తండ్రి దుర్గయ్యపై రాయితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వేధింపులు తట్టుకోలేని దుర్గయ్య.. శ్రీకాంత పడుకున్న తర్వాత అతడి కండ్లలో కారం చల్లి, కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుర్గయ్యను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.