కూతురుపై అత్యాచారం కేసులో.. తండ్రికి 20 ఏండ్ల జైలు

కూతురుపై అత్యాచారం కేసులో.. తండ్రికి 20 ఏండ్ల జైలు

నల్గొండ అర్బన్, వెలుగు: కూతురుపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తండ్రికి 20 ఏండ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ అత్యాచారం, పోక్సో కేసులో ఫాస్ట్  ట్రాక్  కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కులకర్ణి విశ్వనాథ్  దిలీప్ రావు తీర్పు చెప్పినట్లు ఎస్పీ శరత్  చంద్ర పవార్  తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2023 డిసెంబర్ 14న కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన నిందితుడు ఆరో తరగతి చదువుతున్న తన కూతురిపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.

పనికి వెళ్లి వచ్చిన తల్లికి కూతురు తండ్రి చేసిన అఘాయిత్యాన్ని వివరించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నేరం రుజువైందని ఎస్పీ తెలిపారు.