ఉక్రెయిన్‎లో ఓ తండ్రి వ్యథ.. కన్నీళ్లు పెట్టించే వీడియో..

ఉక్రెయిన్‎పై రష్యా గురువారం నుంచి దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో వందలమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా కాపాడాలంటూ కన్నీటితో ఎదురుచూపులు, ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఆ దేశ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ తెలిపారు. తమ వారిని కాపాడుకునేందుకు స్థానిక యువత ముందుకురావాలని, అలా వచ్చిన వారికి కావలసిన ఆయుధాలు కూడా అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా దాడుల నుంచి తమ వారిని కాపాడుకోవాలని ఓ వ్యక్తి తన భార్యాపిల్లలను సురక్షిత ప్రాంతానికి బస్సులో పంపించే సన్నివేశం అందరినీ కట్టిపడేస్తుంది. కూతురుని మళ్లీ చూస్తానో లేదో అని ఆ తండ్రి పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. కూతురుని దూరంగా పంపలేక.. తనతో పాటు ఉంచుకోలేక పాపను పట్టుకొని ఏడ్వడం వర్ణనాతీతం. పాప కూడా తండ్రిని మళ్లీ కలుస్తానో లేదో అని ఎక్కిఎక్కి ఏడుస్తూ కనిపించింది. ఇది చూసిన వారెవరికైనా గుండె చలించక మానదు. ఉక్రెయిన్ ప్రజల బాధను ప్రపంచదేశాలకు తెలియజేయడానికి ఈ వీడియో ఒక్కటిచాలు. గురువారం రాత్రి ట్విట్టర్‎లో పోస్ట్ అయిన వీడియో.. లక్షల్లో వ్యూస్, వేలల్లో రీట్వీట్ అవుతోంది. 

ఇక సైనికుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైంది. దేశం కోసం పోరాడుతూ.. సొంతవాళ్లను చూసుకోలేక వారు పడుతున్న మనోవేదన చెప్పలేనిది. ఓ పక్క యుద్ధం చేస్తూనే.. తమ తల్లిదండ్రుల కోసం వీడియో తీసి పంపుతున్నారు. ఉక్రెయిన్ సైనికుడు తన చేతిలో గన్‎తో గస్తీ చేస్తూ.. ‘అమ్మానాన్న ఐ లవ్ యూ’ అంటూ సందేశమిచ్చాడు.

కొంతమంది సైనికులు తమ భార్యలను వదిలి యుద్ధానికి వెళ్తున్న ఘటనలు అందిరినీ కలిచి వేస్తున్నాయి. ఏడుస్తున్న తమ భార్యలను ఓదార్చుతూ సైనికులు కనిపిస్తున్నారు. యుద్ధానికి వెళ్తున్న తమ భర్తలు మళ్లీ వస్తారో రారో తెలియక.. కమ్ బ్యాక్ సూన్ అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ పార్ట్‎నర్లను హత్తుకొని భావోద్వేగపు వీడ్కోలు చెప్పే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

For More News..

‘భీమ్లానాయక్’ కారణంగా మరో వాయిదా