- తండ్రికి ఐదేండ్ల జైలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నించిన తండ్రికి ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జీ ఎం. శ్యాం గురువారం తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. తమ 13ఏండ్ల కూతురిపై తండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లి భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 నవంబర్ 12న కంప్లైంట్ ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తండ్రి మహ్మద్ షరీఫ్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ బాలిక తల్లికి చెప్పడంతో ఆమె భర్తను నిలదీసింది. తాను మద్యం తాగిన మత్తులో లైంగిక దాడిచేశానని చెప్తూ క్షమించమని కోరాడు.
దీంతో అప్పటితో ఆ గొడవ సద్దుమణిగింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కూతురిపై లైంగిక వేధింపులకు దిగడంతో బాలిక తల్లి షరీఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో సాక్షుల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష, రూ. 10వేల ఫైన్, పోక్సో యాక్ట్ ప్రకారం నాలుగేండ్ల జైలు శిక్ష, రూ. 10వేల ఫైన్ వేస్తూ జడ్పీ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి నిర్వహించారు.