లగ్జరీ లైఫ్‌కోసం పక్కదారి పట్టిన యువకుడు
ఇంజినీరింగ్‌లోనే డ్రగ్స్అలవాటు
అమ్మడానికి వెళ్తూ అడ్డంగా చిక్కాడు
రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
మాదాపూర్, వెలుగు : ఆ యువకుడి తండ్రి రైల్వే డిపార్ట్మెంట్లో ఇంజినీర్..కొడుకును కూడా ఇంజినీర్‌గా చూడాలనుకుని బీటెక్చదివించాడు. అయితే డ్రగ్స్‌కు బానిసైన అతడి కొడుకు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. అది కంటిన్యూ చేయడానికి, డ్రగ్స్ కొనడానికి మాదకద్రవ్యాలను అమ్మడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు అడ్డంగా చిక్కాడు.
మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం..రాజమండ్రిలోని పాతపేటకు చెందిన కాటూరి సూర్యకుమార్(22) బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో బీటెక్చదివాడు. అప్పుడే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. బెంగళూరుకు చెందిన తన ఫ్రెండ్అభి ద్వారా నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ స్మగ్లర్గాడ్ ఆఫ్ సోల్మెన్తో పరిచయమైంది. ఇతని నుంచి సూర్యకుమార్ఎండీఎంఏ కొని వాడేవాడు. డ్రగ్స్అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని, దాంతో లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చని భావించిన సూర్య డ్రగ్స్అమ్మడం మొదలుపెట్టాడు.
జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలే..
సూర్యకుమార్గత ఏడాది డ్రగ్స్స్మగ్లింగ్చేస్తూ చందానగర్పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. మూడు నెలల పాటు శిక్ష అనుభవించి వచ్చినా కూడా అతడి తీరులో మార్పు రాలేదు. మళ్లీ బెంగళూరుకు వెళ్లి నైజీరియర్ సోల్మెన్వద్ద ఎండీఎంఏ కొని వాడేవాడు. ఈ డ్రగ్‌ను రాజమండ్రికి చెందిన చిన్ననాటి ఫ్రెండ్, బీటెక్ స్టూడెంట్ అయిన శ్యామ్‌బాబుకు కూడా అలవాటు చేశాడు.ఈ నెల 14న బెంగళూరుకు వెళ్లి సోల్మెన్వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొన్నాడు. 16న హైదరాబాద్‌కు చేరుకొని తన ఫ్రెండ్ శ్యామ్‌బాబును రాజమండ్రి నుంచి హైదరాబాద్పిలిపించాడు.
ఇద్దరూ కలిసి మాదాపూర్చంద్రనాయక్తండాలోని ఓ అపార్ట్మెంట్లో రెండు గ్రాముల ఎండీఎంఏను వాడారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని స్టూడెంట్స్‌కు ఒక్క గ్రాముకు రూ.10వేల నుంచి 15 వేల వరకు విక్రయించాలని రెడీ అయ్యారు. సమాచారం అందుకున్న మాదాపూర్జోన్ఎస్ఓటీ పోలీసులు అపార్ట్మెంట్వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రూ.5.70 లక్షల 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.