తండ్రిని కొట్టి చంపిన కొడుకు

సమాజంలో మానవత్వం రోజు రోజుకి తగ్గిపోతోందనడానికి నిదర్శనంగా పలు ఘటనలు నిలుస్తున్నాయి. ఏదో ఒక కారణంతో కన్న వాళ్లను కడతేర్చుతున్నారు. అలాంటి ఘటనే వరంగల్​జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వర్ధన్నపేట మండలం ఎన్​ఎస్​ తండాకి చెందిన పాళ్యకు కొడుకు సుమన్​ ఉన్నాడు. కుటుంబ కలహాలతో జూన్​ 27న రాత్రి పాళ్యను.. సుమన్​ విచక్షణా రహితంగా కొట్టాడు.  దెబ్బలు తాళలేక తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సుమన్​ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  హత్యకు గల కారణాలు తెలియరాలేదు.