అపాయింట్ మెంట్ ఇవ్వండి.. అమిత్ షాకు ఆర్జీకర్ ఆస్పత్రి బాధితురాలి తండ్రి లేఖ

అపాయింట్ మెంట్ ఇవ్వండి.. అమిత్ షాకు ఆర్జీకర్ ఆస్పత్రి బాధితురాలి తండ్రి లేఖ

కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో అత్యాచారం,హత్యకు  గురైన బాధితురాలి  తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు  లేఖ రాశారు.  తాము ఎంతో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నామని.. నిస్సహాయక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుందన్నారు.  కొన్ని విషయాలపై  కలిసి మాట్లాడేందుకు.. అపాయింట్ మెంట్ కావాలని అమిత్ షాను రిక్వెస్ట్ చేశారు.  కేసును త్వరగా పూర్తి చేసేలా  అమిత్  షా తమకు మార్గనిర్దేశం చేయాలని .. సహాయం చేయాలని కోరారు. 

నా భార్య, నేను మీతో మాట్లాడాలి. మీరు మీ సౌకర్యాన్ని బట్టి లేదా మీకు నచ్చిన ప్రాంతంలో  మాట్లాడేందుకు సమయం కావాలి.  మా కూతురికి జరిగిన ఘోరమైన అనూహ్య సంఘటన తర్వాత  మేము విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాం.  ఒత్తిడితో   నిస్సహాయక స్థితిలో ఉన్నాం  అనిపిస్తుంది. మీతో మాట్లాడేందుక సమయం ఇస్తామని ఆశిస్తున్నాం..ఎప్పుడు సమయం ఇస్తారో మాకు చెప్పండి అని లేఖలో  రాశాడు. అమిత్ షా జీ మాకు కొంత సమయం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మా కూతురికి  ఇంకా న్యాయం జరగనందున మేము పడుతున్న మానసిక వేదనను  ఆయనకు చెబుతానని బాధితురాలి తల్లి అన్నారు.

ALSO READ | సీజేఐని నేనేం అనలేదు...ఎంపీ రామ్​గోపాల్ యాదవ్

కోల్‌కతాలో 2024 ఆగస్టు 9న జరిగిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసందే. అయితే ఇప్పటికే ఈ సంఘటనలో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.