కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం

కొడుకు ప్రేమవివాహం చేసుకుంటున్నాడని తండ్రి నీచానికి ఒడిగట్టాడు.నాన్న అంటే అండగా ఉండేవాడు. బిడ్డలకు రక్షణ కల్పించేవాడు. అలాంటి తండ్రే కొడుకు ప్రేమవివాహం చేసుకుంటున్నాడని అతని ప్రియురాలిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణంలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో బంగారం వ్యాపారి నిత్యానందం. అతని కుమారుడు ముకేశ్‌ కన్నన్‌. ముకేష్ కన్నన్ తన క్లాస్ మెట్ ను ప్రేమించాడు. ఒకే కమ్యూనిటీకి చెందిన వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని కొడుకు, తండ్రి నిత్యానందానికి  చెప్పాడు. అయితే కొడుకు ప్రేమవివాహాం చేసుకోవడం తండ్రికి నచ్చలేదు. వివాహం జరిపించకపోతే  కొడుకు చచ్చిపోతానన్నాడు.

దీంతో ఆ తండ్రి  ప్రేమికులిద్దరినీ విడదీయడానికి తన దగ్గరి బంధువుతో కలిసి నీచమైన పథకం వేశాడు. దగ్గర బంధువైన శక్తివేల్ అతని భార్య పావున్రాజవల్లి ముగ్గురు కలిసి పెళ్లి చేస్తానంటూ సదరు యువతి ఇంటికి వెళ్లారు. మాయమాటలతో బాధితురాలిని నమ్మించి    శక్తివేల్ ఇంటికి తీసుకెళ్లి బంధించాడు. బలవంతంగా తాళికట్టి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

అయితే ఈ దారుణంపై నిత్యానందం కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. డ్రైవర్ సమాచారంతో  నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..బాధితురాల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

నిత్యానందం పై  376 (లైంగిక వేధింపులు), 342 ( నిర్బంధించడం),  307 (హత్యాయత్నం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపిన ఎస్సై వర్జీనియా..బాధితురాలు పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.

More News

బడ్జెట్ 2020-21 Live Updates

కరోనా వైరస్ : విషాదాన్ని నింపుతున్న వైరల్ వీడియో

లక్ష కోట్లకు వారసుడు.. 2 రూములున్న ఇంట్ల ఉంటున్నడు