సమాజ గుర్తింపులో తండ్రి పాత్ర కీలకం: ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు : సమాజంలో గుర్తింపు రావడానికి తండ్రి పాత్ర చాలా కీలకమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జీసీఎస్ వల్లూరి గ్రూప్ ఆధ్వర్యంలో ‘ సమాజంలో తండ్రి పాత్ర’ అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. 

ALSO READ :వరద గుప్పిట్లోనే ఢిల్లీ.. నీట మునిగిన రిలీఫ్ క్యాంపులు

ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, దైవజ్ఞశర్మ, వల్లూరి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ వీఆర్ శ్రీనివాసరాజు హాజరై వివిధ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న వారికి బంగారు నంది ప్రతిభారత్న నేషనల్ అవార్డ్స్ ను అందజేసి సత్కరించి అభినందించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ గుర్తింపు తెచ్చుకున్న వారిని సత్కరించడంతో వారిలో మరింత బాధ్యత పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ శ్రీనివాస్, రాజు రంజిత, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.