జగిత్యాల: సొంత కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. మే15వ తేదీ బుధవారం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ ఫోక్స్ కోర్టు, జగిత్యాల డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ నీలిమ ఈ ఘటనపై విచారణ చేపట్టి తీర్పు వెల్లడించింది. మైనర్ కూతురుపై లైంగిక దాడికి ప్రయత్నించిన తండ్రికి 25ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమాన విధించింది. బాధితురాలికి మూడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
కోరుట్ల పట్టణంలోని ఎక్కిన్ పూర్ చెందిన జిల్లాల తుకారం(40), మైనర్ అయిన తన కూతురిపై దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణల నేపథ్యంలో 2022 అక్టోబర్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. తన చెల్లిపై సొంత తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని నిందితుని కొడుకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు విచారణ చేపట్టి తుకారంను అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర తర్వాత నిందితుడికి జైలు శిక్ష పడింది.