
పర్వతగిరి (వరంగల్ సిటీ), వెలుగు : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఒకేసారి వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్‌లోఎలక్షన్ డ్యూటీకి హాజరయ్యారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు నాజీతండాకు చెందిన ధర్మానాయక్ వరంగల్ మట్టెవాడ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు వీరస్వామి కేయూసీ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా, కూతురు శాంతి నెక్కొండ మండలం సూరిపెల్లిలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎలక్షన్ సందర్భంగా ధర్మానాయక్, కూతురు శాంతికి వరంగల్ ఈస్ట్‌లో డ్యూటీ పడగా, వీరస్వామికి పర్వతగిరిలో డ్యూటీ పడింది. దీంతో ముగ్గురు బుధవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో కలుసుకున్నారు.