ఖాళీగా ఉండొద్దు అన్నందుకు కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి..

ఎల్బీనగర్, వెలుగు: ‘ఖాళీగా ఉండొద్దు.. ఏదో ఒక పనికి చేస్కో’ అని చెప్పిన కొడుకును ఓ తండ్రి కత్తితో పొడిచి చంపాడు. సరూర్ నగర్ కు చెందిన వీరణగారి రాములు కొడుకు జైపాల్(23), కూతురుతో కలిసి కర్మాన్​ఘాట్ లోని న్యూ మారుతినగర్ లో ఉంటున్నాడు. జైపాల్ ప్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తుంటాడు. అయితే కొంత కాలంగా రాములు ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.

ఈ విషయంలో శుక్రవారం రాత్రి తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఖాళీగా ఉండొద్దని, ఏదో ఒక పనిచేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని జైపాల్​తండ్రికి చెప్పాడు. కోపంతో ఊగిపోయిన రాములు.. తననే పనికి వెళ్లమంటావా అంటూ కొడుకుపై కత్తితో దాడి చేశాడు. మెడ భాగంలో తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జైపాల్ మృతి చెందాడు. సరూర్ నగర్ ఇన్​స్పెక్టర్ సైదిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.