నా కూతురిని నేనే చంపాను : పోలీసులకు లొంగిపోయిన తండ్రి

నా కూతురిని నేనే చంపాను : పోలీసులకు లొంగిపోయిన తండ్రి

గుంతకల్లు.. కసాపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది.  కంటికి కంటికి రెప్పలా పెంచిన కూతురిని హంద్రీనీవా కాలువ వద్ద హత్య చేశానంటూ .. కసాపురం పోలీసుల ఎదుట మంగళవారం( మార్చి 4) లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తిలక్​ నగర్​ లో మసీదు దగ్గర నివసిస్తున్న ఓ వ్యక్తి.. తన కుమార్తె ప్రేమ వ్యవహారంలో తనమాట వినలేదని అందుకే చంపానని తండ్రి పోలీసులుకు చెప్పాడు.  ఎన్ని సార్లు తన వైఖరి మార్చుకోకపోవడంతో విసుగు చెందానని.. అందుకే ఆమెను హంద్రీనీవా కాలువ వద్ద హత్య చేశానని పోలీసుల ఎదుట చెప్పాడు.  

ALSO READ | మతిస్థిమితం లేని మహిళ కిడ్నాప్, రేప్​

అయితే నిందితుడు తండ్రి చెప్పిన వివరాల ప్రకారం హంద్రీనీవా కాలువ వెంట గాలించగా హత్యకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. తన కుమార్తెను చంపానని చెప్పిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని... అతను చెప్పిన విషయాలు నమ్మదగినవి కావని కసాపురం పోలీసులు చెబుతున్నారు.  ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపిన తరువాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు.