కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి

కూతురికి కష్టం వచ్చిందంటే నాన్నే ముందుంటాడు. అలాంటిది ఓ కసాయి తండ్రి తన కూతురిని మంటల్లోకి నెట్టేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

కుటుంబ కలహాలతో తండ్రి కూతురిని మంటల్లో తోసేశాడు ఓ తండ్రి. బాల్కొండ మండలం బుస్సా పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు(జూన్ 18) మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని తండ్రి కాశీరాం కక్ష పెంచుకున్నాడు. గత నెలలో కాశీరాం కోపంతో భార్య బట్టలకు నిప్పు పెట్టాడు.  అదే మంటల్లో కుతూరును తోసేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక..చికిత్స పొందుతూ మృతి చెందింది.