Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా ఫాతిమా.. పాక్ ప్రపంచకప్‌ జట్టు ప్రకటన

Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా ఫాతిమా..  పాక్ ప్రపంచకప్‌ జట్టు ప్రకటన

ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నెలరోజులు ముందుగానే తమ జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ ఫాతిమా సనా నాయకత్వంలో 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును మెగా టోర్నీకి ఎంపిక చేసింది.

నిదా దార్‌పై వేటు

ప్రస్తుత పాక్ మహిళా జట్టు కెప్టెన్‌గా నిదా దార్ సేవలందిస్తోంది. ఆల్‌రౌండరైన నిదా ఆఫ్ స్పిన్నర్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ జట్టులో కీలకం. అలాంటి ఈమెను తప్పించడం వెనుక పీసీబీ వ్యూహమేంటో అంతుపట్టడం లేదు. బహుశా పొట్టి ఫార్మాట్‌లో జట్టును విజయపథంలో నడిపించకపోవటమే ఆమెపై వేటుకు కారణమై ఉండొచ్చు. నిదా దార్ నాయకత్వంలో పాక్ జట్టు 24 టీ20లు ఆడగా..  కేవలం తొమ్మిదింట మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలే ఆమెను కెప్టెన్సీకి దూరం చేశాయి. 

టీ20 ప్రపంచ కప్ 2024కు పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్.

ట్రావెలింగ్ రిజర్వ్: నజిహా అల్వీ (వికెట్ కీపర్)