దంగల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హిందీ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులోభాగంగా సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత క్యాస్టింగ్ ఏజెంట్ ద్వారా ఓ పాత్ర కోసం "అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా" అని అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే మొదట్లో క్యాస్టింగ్ ఏజెంట్ అడిగింది అర్థం కాలేదని కానీ కొంత సమయం ఆలోచించగా అతడు కమిట్మెంట్ అడుగుతున్నాడని గ్రహించినట్లు చెప్పుకొచ్చింది. అలాగే హైదరాబాద్‌లో కొందరు చిన్న నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి నేరుగా సంప్రదించరని కేవలం ఇలాంటి క్యాస్టింగ్ ఏజెంట్ల ద్వారా కాంటాక్ట్ అవుతారని అలాగే ఈ క్యాస్టింగ్ ఏజెంట్లు నటీనటుల రెమ్యునరేషన్స్ లో కూడా కొంత పర్సెంటేజ్ తీసుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారాయి. అయితే తనని కమిట్మెంట్ అడిగిన వ్యక్తుల పేర్లు మాత్రం ఫాతిమా సనా షేక్ బయట పెట్టలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఫాతిమా సనా షేక్ హిందీలో నటించిన ఇటీవలే ప్రముఖ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన శ్యామ్ బహదూర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం ఫాతిమా హిందీ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు "మెట్రో... ఇన్ డినో" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా ప్రముఖ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తుండగా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.