Health Alert : ఫ్యాటీ లివర్ అంటే ఏంటీ.. చిన్న పిల్లల్లో ఎక్కువ ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటీ.. చికిత్స ఎలా..?

Health Alert : ఫ్యాటీ లివర్ అంటే ఏంటీ.. చిన్న పిల్లల్లో ఎక్కువ ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటీ.. చికిత్స ఎలా..?

దేశంలో ఒబేసిటీ సమస్య పెరుగుతున్నదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే... ఫ్యూచర్​లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో ‘బ్రేక్ ది వెయిట్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఏఐజీ హాస్పిటల్ నిర్వహించిన సర్వేలో ఒబేసిటీ గురించి ఆందోళనకర విషయాలు బయటపడ్డాయన్నారు. 

సర్కార్ స్కూల్ పిల్లల్లో 40 శాతం మంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్(ఏన్ఏఎఫ్ఎల్డీ)తో, 80 శాతం ఐటీ ఉద్యోగులు ఒబేసిటీతో 
బాధపడుతున్నారని తెలిపారు. ఒబేసిటీ పశ్చిమ దేశాల సమస్య కాదని, మనదేశంలో ఈ సమస్య తీవ్రత క్రమంగా పెరుగుతుందన్నారు. దేశంలో 60 శాతం మంది ఒబేసిటీతో బాధపడుతున్నారని, 30 శాతం మంది ఒబేసిటీకి చేరువలో ఉన్నారని తెలిపారు. జాగ్రత్తలు తీసుకోకపోతే.. హార్ట్, లివర్, కిడ్నీలు, లంగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.

డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి మాటలను బట్టి చూస్తే.. ఫ్యాటీ లివర్ సమస్య చిన్న,పెద్ద తేడా లేకుండా చాప కింద నీరులా వ్యాపిస్తోందనే అనిపిస్తోంది. ఇంతకీ ఫ్యాటీ లివర్ అంటే ఏంటీ.. పిల్లల్లో ఎక్కువగా ఎందుకు వస్తోంది..  దాని లక్షణాలు, చికిత్స వంటి వివరాలు ఇప్పుడు తేకలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ అంటే ఏంటి:

లివర్ చుట్టూ కొవ్వు పేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సాధారణంగా లివర్ లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే.. లివర్ లో కొవ్వు శాతం పెరుగుతుందో.. అప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది..  లివర్ లో మంట కూడా మొదలవుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్లలో క్యాలరీలు కొవ్వుగా మారి లివర్ సెల్స్ లో స్టోర్ అవుతుంది. దీంతో లివర్ లో మంట మొదలవుతుంది.. ఈ సమస్య ఎక్కువైతే లివర్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

ఫ్యాటీ లివర్ సమస్య జీర్ణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూవుతుంది..ఫ్యాటీ లివర్ ను త్వరగా గుర్తించలేకపోవడమే అతిపెద్ద సమస్య అని చెప్పాలి. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది..ఇప్పుడు తెలుసుకుందాం.

ALSO READ : సర్కారు బడి పిల్లల్లో 40 శాతం మందికి ఫ్యాటీ లివర్..

ఫ్యాటీ లివర్ లక్షణాలు:

ఫ్యాటీ లివర్ సమస్య మొదలైనప్పుడు లక్షణాలు పెద్దగా కనిపించవు. సమస్య తీవ్రమైయ్యే కొద్దీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. దీని లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:

  • బరువు తగ్గడం
  • పొత్తికడుపు పైభాగంలో వాపు  
  • తరచుగా వాంతి వచ్చినట్లు అనిపించడం.
  • ఆకలి లేకపోవడం.
  • ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం.
  • ఎక్కువగా అలసటగా అనిపిస్తుంది


ఫ్యాటీ లివర్ రకాలు:

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్:

మద్యం ఎక్కువగా తాగడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ ను ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కారణంగా లివర్ లో ఫ్యాట్ పేరుకుపోవడంతో పాటు.. లివర్ లో వాపు కూడా ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్:

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్.. ఫుడ్, డ్రింక్స్ వల్ల వస్తుంది.. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం, బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల లివర్ లో ఫ్యాట్ చేరుతుంది. దీని ప్రభావంతో త్వరగా బరువు పెరుగుతారు. ఇది ఊబకాయం, మధుమేహానికి దారి తీయచ్చు. 

ఫ్యాటీ లివర్ ను నివారించడం ఎలా:

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నవారు 6 వారాల పాటు మద్యం తాగడం మానేస్తే.. సమస్య తగ్గుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు మద్యం మానెయ్యడమే ఏకైక నివారణ మార్గం.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సమస్య ఉన్నవారు డీప్ ఫ్రై చేసిన ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యకు దూరంగా ఉండచ్చు.