మాది పాక్ కాదు.. నేనొక ఇండియన్ అమెరికన్‌‌ని.. ప్రభాస్ హీరోయిన్ క్లారిటీ

మాది పాక్ కాదు.. నేనొక ఇండియన్ అమెరికన్‌‌ని.. ప్రభాస్ హీరోయిన్ క్లారిటీ

పహల్గాం టెర్రర్ అటాక్‌‌ ప్రభావం సినీ ఇండస్ట్రీపైనా పడింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’  చిత్రంలో హీరోయిన్‌‌గా నటిస్తున్న  ఇమాన్విది పాకిస్తాన్ అని, ఆమె తండ్రి పాకిస్తాన్ మిలటరీలో వర్క్ చేశారని ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. దీంతో  తనను వెంటనే ఈ చిత్రం నుంచి తప్పించాలని  కొందరు కామెంట్లు పెట్టారు. 

దీనిపై క్లారిటీ ఇస్తూ ఇమాన్వి ఓ నోట్ విడుదల చేసింది. పహల్గాం దాడిని ఖండించిన ఆమె.. తన ఫ్యామిలీ గురించి జరుగుతున్న  ప్రచారంలో నిజం లేదని,  తన కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలటరీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనొక ఇండియన్ అమెరికన్‌‌ని. నేను పుట్టింది కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌‌లో.

కానీ నాకు భారతీయ మూలాలు ఉండటంతో హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలను నేర్చుకున్నా. అవన్నీ మాట్లాడగలను. అమెరికాలోని యూనివర్సిటీలో చదువు పూర్తి చేసిన తర్వాత యాక్టర్‌‌‌‌గా, డ్యాన్సర్‌‌‌‌గా కెరీర్ ప్రారంభించా. భారతీయ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం ఎంతో గొప్పగా భావించా. భారతదేశంపై ప్రేమ, భక్తి నా నరనరాల్లో ప్రవహిస్తోంది’ అని ఇమాన్వి తెలియజేసింది.