వన్డే వరల్డ్ కప్ ముంగిట పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఫవాద్ ఆలం(Fawad Alam) పాక్ జట్టుతో తెగతెంపులు చేసుకున్నాడు. వన్డే జట్టుకు ఎప్పుడో దూరమైన ఈ వెటరన్ బ్యాటర్.. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్‌లోనూ విఫలమవుతున్నాడు. దీంతో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో తన 15 ఏళ్ల సుదీర్ఘ పాకిస్తాన్ కెరీర్‌కు తెర తీశాడు.
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతూ డబ్బులు వెనకేసుకోవాలన్న ఆశతోనే ఫవాద్ ఆలం ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే అతడు స్థానిక ఆటగాడిగా మైనర్ క్రికెట్ లీగ్ టోర్నీలో చికాగో కింగ్స్‌మెన్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతడు తీసుకున్న ఈ నిర్ణయంతో మేజర్ లీగ్ టోర్నీకి కూడా మార్గం సుగమైంది.
ALSO READ :వరకట్న వేధింపులతో అత్తమామలపై ఫిర్యాదు చేసిన రెజ్లర్
ఇప్పటికే పలువురు పాక్ ఆటగాళ్లు అమెరికాకు క్యూ కట్టిన విషయం తెలిసిందే. సమీ అస్లాం, హమ్మద్ అజాం, సైఫ్ బదర్, మహమ్మద్ మొహ్సిన్.. ఇలా చాలామందే ముందుగానే దారులు వెతుక్కున్నారు. ఫవాద్ తన 15 ఏళ్ల కెరీర్‌లో 19 టెస్టులు, 38 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 5 సెంచరీలు చేసిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, వన్డేల్లో ఒక శతకం మాత్రమే బాదాడు.