AbirGulaal: పాక్ నటుడు ఫవాధ్​ఖాన్‌కు షాక్.. యూట్యూబ్ నుంచి 'అబీర్ గులాల్' సాంగ్స్ డిలీట్

AbirGulaal: పాక్ నటుడు ఫవాధ్​ఖాన్‌కు షాక్.. యూట్యూబ్ నుంచి 'అబీర్ గులాల్' సాంగ్స్ డిలీట్

పాక్ నటుడు ఫవాద్‌ ఖాన్‌ (Pahad Khan) వాణీకపూర్‌ జంటగా నటించిన మూవీ అబీర్‌ గులాల్‌ (Abir Gulaal). ఈ మూవీ మే 9న రిలీజ్ కావల్సి ఉంది.  పహల్గామ్‌ విషాదకరమైన ఉగ్రదాడి తర్వాత 'అబీర్‌ గులాల్‌' మూవీ ఇండియాలో నిషేధించబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ నటుడు ఫవాద్‌ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. 'అబీర్‌ గులాల్‌'  సినిమాలో ఉన్న పాటలను యూట్యూబ్ నుండి మేకర్స్ తొలగించారు.  

ఎ రిచర్ లెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఉన్న మూవీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ నుండి రెండు పాటలు తొలగించారు మేకర్స్.  అంతేకాకుండా సరిగమప అధికారిక యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా డిలేట్ చేశారు. 

ఇటీవలే 'అబీర్‌ గులాల్‌' మూవీ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఖుదాయా ఇష్క్' మరియు 'అంగ్రేజీ రంగ్రాసియా' పాటలను ఏప్రిల్ 25న సరిగమప ప్లాట్‌ఫామ్ నుండి డిలేట్ చేశారు. ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ నటులపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రతిస్పందనగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది.

ఇకపోతే, 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ పహాల్గమ్ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత, సోషల్ మీడియాలో పాకిస్థాన్ పై నటులపైనా కోపం పెరుగుతోంది. దాంతో పాక్ నటుడు ఫవాద్‌ ఖాన్‌ నటించిన అబీర్ గులాల్ చిత్రాన్ని బహిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. 

ఈ వివాదం మధ్య, ఫవాద్ ఖాన్ మరియు వాణి ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించారు. ఫవాద్ ఖాన్ తన సంతాపాన్ని తెలిపారు. "పహల్గామ్‌లో జరిగిన దారుణమైన దాడి వార్త విని చాలా బాధపడ్డాను.ఈ భయానక సంఘటన బాధితులతో మా ఆలోచనలు మరియు ప్రార్థనలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు బలం ఇవ్వాలని, వారు త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నాము" అని ఫవాద్ ఖాన్ వెల్లడించారు.