
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించినందుకు ఓ యవకుడు ఏకంగా యువతిని చంపేశాడు. హుబ్బళ్లి ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె నేహా హీరేమత్ (24) బీవీబీ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ ఫయాజ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
అందుకు నేహా నిరాకరించడంతో పగ పెంచుకున్న ఫయాజ్.. ఆమె కాలేజీకి వెళ్తుండగా అకస్మాత్తుగా దాడి చేసి హత్య చేశాడు. అతడు నేహా మేడపై 9 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన నేహాను వెంటనే స్థానిక సహవిద్యార్థులు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నేహా మృతి చెందింది. నిందితుడు ఫయాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఫయాజ్ నేహా చదువుతున్న కాలేజీలోనే సీనియర్. ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య సహా కాంగ్రెస్ నేతలు ఆస్పత్రిని సందర్శించి నేహా కుటుంబాన్ని ఓదార్చారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నగర విభాగం కళాశాల ఎదుట నిరసన చేపట్టింది.