హైదరాబాద్, వెలుగు: పెద్దవారిలో మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ చికిత్స కోసం ఉపయోగించే 'ట్రాజోడోన్' టాబ్లెట్‌కు అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) ఆమోదం లభించిందని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు. ఈ ట్రాజోడోన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్ యూఎస్పీ 50 ఎంజీ, 300 ఎంజీ డోసుల్లో లభిస్తాయి.
దీనిని ప్రాగ్మా ఫార్మాస్యూటికల్స్ ఎల్ఎల్సీ రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ అన్నారు. దరఖాస్తు చేసిన పది నెలల్లోనే అనుమతి లభించిందని, ఇదే క్వార్టర్లో ఉత్పత్తి ప్రారంభించనున్నామని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.