- ఐదేండ్ల ఆడిట్ రికార్డులను పరిశిలించిన ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు మంగళవారం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల ముందు హాజరయ్యారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సహా గత నెల రోజుల వ్యవధిలో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన వివరాలతో కూడిన డాక్యుమెంట్లను అందించారు.
ఐదేండ్ల ఐటీ చెల్లింపులు సహా తన ప్రొడక్షన్స్‌కు సంబధించిన ఆదాయ, వ్యయాలపై వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు దిల్ రాజును అధికారులు ప్రశ్నించారు. ఐటీ చెల్లింపుల వ్యత్యాసాలకు సంబంధించి స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఫైనాన్సియర్స్‌పై గత నెలలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో ఐటీ చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు.