వేదిక లీడ్ రోల్‌లో డా. హరిత గోగినేని తెరకెక్కించిన చిత్రం ‘ఫియర్’. డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. ఈనెల 14న విడుదలైన ఈ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ ‘పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు రివీల్ చేస్తున్నాం. కేవలం 16 రోజుల్లో దీన్ని పూర్తి చేశాం. సినిమా స్టార్ట్ చేసిన 7 నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం. ఒక చిన్న చిత్రాన్ని ఇంత తక్కువ టైమ్‌లో పూర్తి చేసి రిలీజ్ చేయడం, 39 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డ్స్ రావడం సాధారణ విషయం కాదు.
మాకున్న బడ్జెట్‌లో క్వాలిటీగా తీశాం. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కలిసి చూడదగ్గ సినిమా’ అని చెప్పారు. నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ ‘రిలీజ్ చేసిన ప్రతి సెంటర్‌లో కలెక్షన్స్, ప్రేక్షకుల స్పందన బాగున్నాయి. నా వైఫ్ హరితలో ఒక దర్శకురాలిగా ఇంత ప్రతిభ ఉందా అనిపించింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా సిన్సియర్ ఎఫర్ట్‌తో డిఫరెంట్‌గా చేశారనే ప్రశంసలు వస్తున్నాయి’ అని చెప్పారు. డీవోపీ ఐ అండ్రూ, నటులు షానీ, అప్పాజీ అంబరీష్, నటి సాహితి పాల్గొన్నారు.