
వేదిక ప్రధాన పాత్రలో డా.హరిత గోగినేని తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. అరవింద్ కృష్ణ కీలకపాత్రలో నటించాడు. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ను విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. తనను ఎవరో ఫాలో అవుతున్నారంటూ భయపడే సింధు అనే పాత్రలో వేదిక కనిపించింది.
బాల్యం నుంచి ఆమెను వెంటాడుతున్న బూచోడు ఎవరు.. ఎందుకామెను భయపెడుతున్నాడు అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలాగే చివర్లో హీరోయిన్‌ను డ్యూయల్ రోల్‌లో చూపించడం, అనూప్ రూబెన్స్ సంగీతం, ఐ ఆండ్రూ విజువల్స్ ఆకట్టుకున్నాయి. జేపీ, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, షాయాజీ షిండే, సత్య కృష్ణ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈనెల 14న సినిమా విడుదల కానుంది.