- బ్లేడ్, రాళ్లతో తనను తాను గాయపర్చుకున్న బాధితురాలు!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. వసాయ్ ఏరియాలో 20 ఏళ్ల యువతిపై పరిచయస్తుడైన ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని నలసోపారా టౌన్‌షిప్‌లో యువతి(20)..తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నది. ఈ నెల 21న రాత్రి ఆమె తనకు పరిచయస్తుడైన ఆటో డ్రైవర్‌తో బయటకు వెళ్లింది.
వారిద్దరూ ఆ రాత్రంతా హోటల్‌లో గడపాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకపోవడంతో హోటల్ రూమ్ దొరకలేదు. దాంతో నలసోపారాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఆర్నాలా బీచ్‌కు వెళ్లారు.
అక్కడ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటి సమీపంలో రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. రాత్రంతా ఎక్కడికి వెళ్లావని తన తల్లిదండ్రులు కొడతారని భయపడిన యువతి పోలీసులకు ఫోన్ చేసి.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది.
దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెడికల్ టెస్టుల తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్ లో సిజేరియన్ బ్లేడ్, రాళ్ల ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. యువతి ఆటో డ్రైవర్‌తో కావాలనే బయటకు వెళ్లిందని.. ఇంట్లో వాళ్లు కొడతారనే భయంతో రేప్ నాటకం ఆడిందని వెల్లడైంది. అత్యాచారం నిజమేనని.. కానీ సిజేరియన్ బ్లేడ్, రాళ్లతో ఆమెనే తన ప్రైవేట్ పార్ట్ ను గాయపర్చుకున్నట్లు అనుమానిస్తున్నారు.