
శుక్రవారం వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల సన్ది మొదలవుతుంది. అంతేకాదు ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ భవితవ్యం కూడా ఈ శుక్రవారం మీద ఆధారపడి ఉంటుంది. గతవారం టాలీవుడ్ లో రిలీజ్ అయిన లైలా,బ్రహ్మ ఆనందం సినిమాలు ఆడియన్స్ ని నిరాశ పరిచాయి. ఇప్పుడు ఈ శుక్రవారం (ఫిబ్రవరి 21) రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
బ్రహ్మాజీ నటించిన "బాపు":
తెలుగు యంగ్ డైరెక్టర్ దయా దర్శకత్వం వహించిన బాపు చిత్రం ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది. ఫాథర్ & ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, వెటరన్ హీరోయిన్ ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల మరియు అవసరాల శ్రీనివాస్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజు మరియు సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇటీవలే బాపు సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
జబర్దస్త్ కమెడియన్ ధనాధన్ ధనరాజ్ "రామం రాఘవం":
జబర్దస్త్ కమెడియన్ ధనాధన్ ధనరాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం "రామం రాఘవం". ఈ సినిమాలో సముద్రఖని, హరీష్ ఉత్తమన్, ధనరాజ్ కోరనాని, సత్య, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, మోక్ష సేన్‌గుప్తా మరియు ప్రమోదిని తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు సంగీతం అందించగా శివప్రసాద్ యానాల స్టోరీ అందించాడు. ఈ సినిమా కూడా తండ్రి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో ధనరాజ్ తెరకెక్కించాడు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
తెలుగులో డబ్ అవుతున్న తమిళ్ సినిమాలు..
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (తెలుగు డబ్:
ఆమధ్య వచ్చిన లవ్ టుడే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ ఈసారి "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" పేరుతో అలరించాడనికి లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ నటించారు. కే.ఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, వీజే సిద్దు, ఇంధుమతి మణిగందన్, తేనప్పన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతోంది.
జాబిలమ్మ నీకు అంత కోపమా (తెలుగు డబ్) :
కొలీవ్ స్టార్ హీరో ధనుష్ మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా "జాబిలమ్మ నీకు అంత కోపమా". ఈ సినిమాలో పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. రాయన్ సినిమా తర్వాత మంచి క్లాసికల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.