
- ఇదే యాక్సిడెంట్లో గాయపడిన భవాని
- ఈ నెల 11న మృతి
శామీర్ పేట, వెలుగు: శామీర్‌పేట మండలం బిట్స్ చౌరస్తాలో రెడీమిక్స్లారీ ఢీకొని తీవ్రంగా గాయపడిన కొరివి గాయత్రి(24) ఆదివారం చనిపోయింది. ఇదే ఘటనలో గాయపడిన కొరివి భవాని(19) కొంపల్లి శ్రీకర హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈనెల 11న చనిపోయింది. తర్వాత మెరుగైన చికిత్స కోసం గాయత్రిని మరో హాస్పిటల్‌కు తరలించారు.
ఏడు రోజులుగా మృత్యువుతో పోరాడిన గాయత్రి ఆదివారం రాత్రి కన్నుమూసింది. గాయత్రి, భవాని అన్నదమ్ముల పిల్లలు. వీరిద్దరూ తిరుమలగిరిలోని కంపెనీలో డ్యూటీకి వెళ్లేందుకు ఈ నెల 10న బిట్స్చౌరస్తాలోని బస్టాప్‌కు వచ్చారు. బస్సు కోసం చూస్తుండగా అదే టైంలో దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది.