
మహాశివరాత్రిపర్వదినం..దేశంలోనే అతిపెద్ద హిందువుల పండగల్లో ఒకటైన మహాశివరాత్రిని బుధవారం (ఫిబ్రవరి 26) న భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈసంద ర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. బ్యాంకులతోపాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఫిబ్రవరి 26న అన్ని మూసివేయబడతాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాం కులకు సెలవులు ఇచ్చారు.
గుజరాత్, జమ్మూకాశ్మీర్, మిజోరాం,మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఛత్తీ స్ గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బ్యాంకులు మూసివేయబడతాయి.
శివరాత్రి అంటేనే ఉపవాసం, శివునికి భక్తిశ్రద్దలతో పూజలు, జాగారం అంటారు. పరమశివునికి ఇష్టమైన రోజు అయిన శివరాత్రి రోజున ఉపవాసం, జాగారం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. సాధారణంగా శివరాత్రి తర్వాతి రోజున సెలవు ఇస్తారు..అయితే ఈ సారి శివరాత్రి పర్వదినం రోజునే సెలవు ప్రకటించింది ఆర్బీఐ. దీంతో జాగారం, ఉపవాసం చేసిన వారికి మరుసటి రోజు సెలవు ఉంటుందా లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ | రైతులకు నష్ట పరిహార చెక్కుల పంపిణీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం..కొన్ని రాష్ట్రాల్లో బుధవారం ఫిబ్రవరి 26 , మరికొన్ని రాష్ట్రాల్లో శుక్రవారం ఫిబ్రవరి 28న బ్యాంకులు మూసివేయబడతాయి.బ్యాంకు శాఖలు మూసివేయబడినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, ATMల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.