రేపు (ఫిబ్రవరి 7) ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు తగ్గిస్తారా.. స్టాక్ మార్కెట్ దారెటు..?

రేపు (ఫిబ్రవరి 7) ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు తగ్గిస్తారా.. స్టాక్ మార్కెట్ దారెటు..?

 డాలర్ పెరుగుదల, రూపాయి పతనం భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని (ఇన్ ఫ్లేషన్) కట్టడి చేసేందుకు, మార్కెట్లో కన్జంప్షన్ పెంచేందుకు ఇటీవలే ఇన్ కమ్ ట్యాక్స్ ను రూ.12 లక్షల వరకు జీరో చేయడం తెలిసిన విషయమే. అయితే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆర్బీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

గురువారం (ఫిబ్రవరి 7) ఆర్బీఐ మానిటరీ పాలసీ సందర్భంగా రేట్ కట్స్  (ఆర్బీఐ వడ్డీలు తగ్గించడం) ఉంటాయా ఉండవా అనే చర్చ మొదలైంది. అయితే కోవిడ్-19 (కరోనా) తర్వాత గత నాలుగేళ్లుగా రేట్ కట్స్ చేపట్టలేదు ఆర్బీఐ. 2020 మే నెలలో 40 బేసిస్ పాయింట్లు తగ్గించి రెపో రేట్లను 4 శాతానికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం కంట్రోల్ లోనే ఉండటం, జీడీపీ వృద్ధి పరవాలేదన్నట్లు ఉండటంతో రేట్ కట్స్ కు వెళ్లలేదు. ఆ తర్వాత 2022 లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రేట్లను మళ్లీ పెంచారు. 2023 నుంచి ఎలాంటి హైక్, కట్ లేకుండా వడ్డీ రేట్లను అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా డాలర్ పెరుగుదల, రూపాయి తగ్గుదల, అదే విధంగా టారిఫ్ లతో ట్రంప్ హెచ్చరికల నడుమ.. ఇప్పటికే జీడీపీ నెమ్మదించడాన్ని దృష్టిలో ఉంచుకొని రేపటి పాలసీ మీటింగ్ లో 25 బేసిస్ పాయింట్ల కట్ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా కూడా రేట్ కట్స్ కు పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం. వడ్డీరేట్లు తగ్గించి కన్జంప్షన్ పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలస్తోంది. 

Also Read :- బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కారు కొన్న అంబానీ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కూడా ఈసారి రేట్ కట్స్ ఉండనున్నాయనే నిర్ధారణకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ‘‘బడ్జెట్ కన్జంప్షన్ ను దృష్టిలో ఉంచుకుని మధ్య తరగతికి అనుకూలంగా ప్రవేశపెట్టాం. భారత ఆర్థిక వ్యవస్థకు ఏది మంచో అది చేయమని ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడం. గ్రోత్ ను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది’’ అని ఆమె అన్నారు.

మార్కెట్ల పయనం ఎటువైపు:

డాలర్ పెరుగుదల, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో ఫారెన్ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఇండియన్ మార్కెట్లు గత కొంత కాలంగా తీవ్ర నష్టాలను చవిచూస్తూ వస్తు్న్నాయి. తాజాగా బడ్జెట్ తో కొంత ఉపశమనం లభించినప్పటికీ.. రూపాయి పతనం, యూఎస్ టారిఫ్ వార్నింగ్, డాలర్ స్ట్రాంగ్ అవుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. అయితే గురువారం ఒకవేళ అనుకున్నట్లుగానే 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తే స్టాక్ మార్కెట్ కు పాజిటివ్ అంటున్నారు విశ్లేషకులు. 

బ్యాంకులు, ఫైనాన్షియల్, కన్జ్యూమర్ సెక్టార్లు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తగ్గించడంతో బ్యాంకులు తక్కువ బడ్డీకే ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకోవడం.. దీంతో లోన్ గ్రోత్ పెరగడంతో ఎకానమీ బూస్ట్ అవుతుంది. అదేవిధంగా వినియోగదారుడి ఖర్చు పెట్టే సామర్థ్యం పెరగడం కూడా పాజిటివ్ గా చూడవచ్చు. ఎకనమిక్ గ్రోత్ ను దృష్టిలో ఉంచుకొని వడ్డీ రేట్లు తగ్గించే చాన్స్ ఉండటంతో.. మార్కెట్లు కూడా పాజిటివ్ గా టర్నౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.