
న్యూఢిల్లీ: మార్కెట్ పడుతుండడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులు కిందటి నెలలో భారీగా తగ్గాయి. ఏడాది లెక్కన 26 శాతం తగ్గి రూ.29,303 కోట్లకు చేరాయి. స్మాల్, మిడ్‌క్యాప్ స్కీమ్స్‌కు ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలోనూ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ప్లాన్స్(సిప్) ఇన్‌ఫ్లోలు ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి చేరుకొని రూ.25,999 కోట్లుగా నమోదయ్యాయి. జనవరి సిప్ఇన్ఫ్లో రూ.26,400 కోట్లు కాగా, డిసెంబరులో రూ.26,459 కోట్లు ఉంది.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఈక్విటీ- ఆధారిత ఫండ్లకు జనవరిలో రూ. 39,688 కోట్లు, డిసెంబర్‌లో రూ. 41,156 కోట్లు వచ్చాయి. జనవరిలో మిడ్ స్మాల్-క్యాప్ ఫండ్లలో ఇన్‌ఫ్లో వరుసగా రూ.5,147 కోట్లు, రూ.5,720 కోట్లు ఉండగా, ఫిబ్రవరిలో రూ.3,406 కోట్లు, రూ.3,722 కోట్లకు తగ్గింది. లార్జ్-క్యాప్ ఫండ్లలో ఇన్‌ఫ్లోలు జనవరిలో రూ.3,063 కోట్ల నుంచి రూ.2,866 కోట్లకు తగ్గాయి. థీమాటిక్ ఫండ్లలో అత్యధికంగా రూ.5,711 కోట్ల నికర ఇన్‌ఫ్లో ఉంది. ఫ్లెక్సీ ఫండ్లలో రూ.5,104 కోట్ల ఇన్‌ఫ్లో ఉంది. గత నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ రూ. 6,525 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నాయి.