ఫిబ్రవరిలో దిగొచ్చిన వాణిజ్య లోటు

ఫిబ్రవరిలో దిగొచ్చిన వాణిజ్య లోటు
  • దిగుమతులు తగ్గడమే కారణం

న్యూఢిల్లీ: ఇండియా వాణిజ్య లోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) ఈ ఏడాది ఫిబ్రవరిలో  భారీగా తగ్గింది. దిగుమతులు పడిపోవడంతో ఫిబ్రవరిలో  14.05 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు  నమోదైంది.  నాలుగేండ్లలో ఇదే తక్కువ.   ఈ ఏడాది జనవరిలో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌  22.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫిబ్రవరిలో ఇండియా 36.91 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.   50.96 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది.  

జనవరిలో 36.43 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 59.42 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా 2.3 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్‌‌‌‌ను దిగుమతి  చేసుకుంది. అంతకు ముందు నెలలో నమోదైన 2.68 బిలియన్ డాలర్ల నుంచి తగ్గింది. క్రూడాయిల్ దిగుమతులు కూడా 13.4 బిలియన్ డాలర్ల నుంచి 11.8 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి.  కిందటి నెలలో 35.03 బిలియన్ డాలర్ల విలువైన సర్వీసెస్ ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌, 16.55 బిలియన్ డాలర్ల ఇంపోర్ట్స్ జరిగాయని అంచనా.