ఫిబ్రవరి 3వ తేదీ కుంభమేళా ప్రత్యేకత ఏంటీ.. ఆ రోజు పుణ్య స్నానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది..

ఫిబ్రవరి 3వ తేదీ కుంభమేళా ప్రత్యేకత ఏంటీ.. ఆ రోజు పుణ్య స్నానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది..

ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​ రాజ్​ లో కుంభమేళా జరుగుతుంది.  ప్రపంచవ్యాప్తంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13 భోగి పర్వదినాన ప్రారంభమైన కుంభమేళా  45 రోజుల పాటు  .. అంటే  ఫిబ్రవరి 26 వ తేదీన ముగుస్తుంది.    కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరుగనున్నాయి. ఇవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి రోజు జరుగనున్నాయి. ఇప్పటికే మూడు రాజ స్నానాలు ముగియగా నాలుగో రాజస్నానం వసంత పంచమి ( ఫిబ్రవరి 3) వ తేది జరగనుంది.  

 వసంత పంచమి రోజున నాలుగో రాజస్నానం ఎందుకు చేయాలి..

పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మదేవుడి ప్రార్థన వలన సరస్వతి దేవి ఆ రోజున అంటే మాఘమాసం శుద్ద పంచమి రోజున ( ఈ ఏడాది ఫిబ్రవరి 3) జన్మించింది.  సరస్వతి దేవి చదువుల తల్లి.. విద్యకు అధిదేవత అని పండితులు చెబుతారు.  ఇక ఈ ఏడాది కుంభమేళా జరుగుతుంది కాబట్టి ఆరోజు పుణ్య స్నాన చేయాలని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

వసంతపంచమి రోజున కుంభమేళాలో పుణ్య స్నానం చేసేవారు ముందుగా నదీమతల్లికి నమస్కరించాలి.  తరువాత నదిలో చిటికెడు పసుపు.. కుంకుమ వేయాలి.  తరువాత నది ఒడ్డున కొద్దిగా మట్టిని తీసుకొని నమస్కరిస్తూ నదిలోకి ప్రవేశించాలి.  తరువాత ఆ మట్టిని దోసెలలో ఉంచి  నదిలో కలిపి.. మూడుసార్లు తల మునిగే వరకు మునగాలి.  

ALSO READ | బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..

ఆ తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి.   ముఖం తూర్పు దిక్కున ఉండే విధంగా నిలబడి దోసెలతో మూడు సార్లు నీళ్లు తీసుకుని వదలాలి. తరువాత నది నుంచి బయటకు వచ్చి.. నదికి నమస్కరించి పసుపు.. కుంకుమ..పూలతో పూజించి.. హారతి ఇవ్వాలి.  అరటి దొన్నెలో దీపం వెలిగించి నదిలో వదిలి నమస్కారం చేయాలి.  తరువాత పేదలకు.. బ్రాహ్మణులకు శక్తి కొలది దానం చేయాలి. 

కుంభమేళాలో వసంత పంచమి రోజు (ఫిబ్రవరి 3) పుణ్య స్నానం చేస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి.  పిల్లలకు విద్యలో రాణిస్తారు.  వసంత పంచమి సరస్వతి దేవి పుట్టిన రోజు.. ఆ రోజు జీవ నదుల్లో సరస్వతి దేవి నిక్షిప్తమై ఉంటుందని పండితులు చెబుతున్నారు.  అందుకే నదీమ తల్లికి పూజలు చేసి హారతి ఇవ్వాలి.   చదువుకునే పిల్లలకు పుస్తకాలు ... పెన్నులు.. పెన్సిళ్లు పంచి పెట్టాలి.