భర్తల తాగుడుతో విసిగిపోయామని చెప్పి ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. ఇన్ స్టా గ్రామ్ లో పెరిగిన పరిచయంతో ఘోరక్ పూర్ లో మహిళలు పెళ్లి చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని ఘోరక్ పూర్ లో కవిత, గుంజా (బబ్లూ) ఇద్దరు మహిళలు పెల్లి చేసుకున్నారు. గురువారం (23 జనవరి)ఇంట్లోనుంచి వెళ్లొచ్చిన మహిళలు అదేరోజు సాయంత్రం డియోరియా లోని మినీ కాశీగా పిలవబడే శివుని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిన ఇద్దరు మహిళల పరిస్థితులు దాదాపు సేమ్ కావడంతో ఒకరిపై ఒకరికి సానుభూతి, అభిమానం ఏర్పడ్డాయి. తాగుబోతు భర్తలతో ఇద్దరూ ఒకే విధమైన గృహ హింసను ఎదుర్కోవడం.. ఒకరి పరిస్థితి ఒకరు తెలుసుకొని ఇద్దరూ దగ్గరయ్యారు .
Also Read :- పెండ్లి చేసుకుంటానని అత్యాచారం..యువకుడిపై యువతి ఫిర్యాదు
పెళ్లికొడుకుగా గుంజ పెళ్లి కూతురుగా కవితను భావించి ఆమె నుదుట సిందూరం బొట్టు పెట్టగా.. ఆ తర్వాత ఇద్దరూ పూల దండలు మార్చుకొని, ఏడడుగులు వేసి ఒక్కటయ్యామని తెలిపారు.
భర్తలు తాగొచ్చి హింసించే వారని, ప్రశాంతమైన జీవితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. గోరక్ పూర్ లోనే ఇల్లు అద్దెకు తీసుకొని ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తామని అన్నారు.
వీరి వివాహం చేసిన ఆలయ అర్చకుడు ఉమా శంకర్ పాండే మాట్లాడుతూ.. ఇద్దరు పూల దండలు, కుంకుమ కొనుక్కుని.. పెళ్లి చేసుకున్నారని, తంతు ముగిసిన వెంటనే వెళ్లిపోయారని తెలిపారు.