50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్‌

న్యూఢిల్లీ: యూఎస్‌ ఫెడ్  వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆశ్చర్య పరిచింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని ఎనలిస్ట్‌లు అంచనా వేశారు.   గత నాలుగేళ్లలో ఇదే మొదటి రేటు కోత.  దీంతో యూఎస్‌లో  బారోవింగ్  రేటు ప్రస్తుతం ఉన్న 5.25–5.50 శాతం నుంచి  4.75– 5.00 శాతానికి తగ్గింది. ఇన్‌ఫ్లేషన్ టార్గెట్‌ 2 శాతం కంటే కొద్దిగా పైన  రికార్డ్‌ అవ్వడంతో పాటు,  జాబ్ మార్కెట్‌ మెరుగ్గా కనిపించడంతో  వడ్డీ రేట్లను  హాఫ్‌ పాయింట్ తగ్గించింది.

  ఈ ఏడాది చివరిలోపు మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని, వచ్చే ఏడాది  ఒక శాతం తగ్గించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2026 లో  మరో 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించొచ్చని చెబుతున్నారు.   ఫెడ్ వడ్డీ రేట్లను గత 12 నెలలుగా  మార్చలేదు.