ఫీజు బకాయిలు రూ.6500 కోట్లు రిలీజ్ చేయాలి : డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం

ఫీజు బకాయిలు రూ.6500 కోట్లు రిలీజ్ చేయాలి : డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం
  • సర్కారుకు ప్రొఫెషనల్, డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ల విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 2021 నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.6,500 కోట్ల  ఫీజు రీయింబర్స్ మెంట్  బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రొఫెషనల్, డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్​లో ఫార్మసీ, నర్సింగ్, ఇంజినీరింగ్, బీఈడీ, డిగ్రీ, జూనియర్, ఎంబీఏ, ఎంసీఏ తదితర ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్  సంఘాల నేతల సమావేశం జరిగింది. అనంతరం ఆయా మేనేజ్మెంట్ల ప్రతినిధులు జైపాల్ రెడ్డి, నాగయ్య చౌదరి, రాందాస్, పరమేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు.

 మూడున్నర ఏండ్లుగా ఫీజు బకాయిలను ప్రభుత్వాలు రిలీజ్  చేయకపోవడంతో సిబ్బంది, ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. దీంతో సిబ్బంది వివిధ ఈఎంఐలు, ఇంటి రెంటు, పన్నులు, క్రెడిట్  కార్డు బకాయిలు చెల్లించలేకపోతున్నాయని, ఫలితంగా బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ మేనేజ్మెంట్లు ఇచ్చే చెక్స్  కూడా బౌన్స్  అవుతున్నాయని వెల్లడించారు.