- ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి
సూర్యాపేట, వెలుగు : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డు నుంచి కొత్త బస్టాండ్ వరకు స్టూడెంట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయకపోవడంతో రూ. 3,375 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న సీఎం కేసీఆర్ బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం వల్ల స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక వసతులు లేక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా రంగానికి బడ్జెట్‌లో 10 నుంచి 12 శాతం నిధులు కేటాయిస్తే, ప్రస్తుతం 5 నుంచి 6 శాతమే కేటాయించడం సరికాదన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ డివిజన్ అధ్యక్షుడు లింగస్వామి, జలగం సుమంత్, బట్టిపల్లి మహేశ్, నల్గొండ అజయ్, తాళ్లపల్లి సాయిప్రత్యూష, నందిని, కల్యాణి, అఖిల, లిఖిత, నవ్య పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు పర్మిషన్ త్వరగా ఇవ్వాలి
నల్గొండఅర్బన్, వెలుగు : పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటవెంటనే మంజూరు చేయాలని నల్గొండ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. టీ ప్రైడ్ పథకం కింద 26 మంది ఎస్సీలు, 56 మంది ఎస్టీలు, ఒక దివ్యాంగుడికి సబ్సిడీ మంజూరుకు కమిటీ సిఫార్సు చేసినట్లు చెప్పారు. అనంతరం ముగ్గురు ఎస్సీలకు మైక్రో యూనిట్లకు సంబంధించిన పావలా వడ్డీని మంజూరు చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు.ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం బాలల హక్కులు, అవగాహనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
నులిపురుగుల నివారణకు కృషి చేయాలి
సూర్యాపేట, వెలుగు : నులి పురుగుల నివారణకు హెల్త్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూచించారు. సోమవారం సూర్యాపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీ స్టూడెంట్లకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేయాలని చెప్పారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
మట్టి విగ్రహాలకు ప్రయారిటీ ఇవ్వాలి
వినాయక చవితి ఉత్సవాలను కలిసిగట్టుగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలకు ప్రయారిటీ ఇవ్వాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శాలివాహన సంఘం ద్వారా అందించిన మట్టి గణపతి విగ్రహాలను సోమవారం ఉద్యోగులు, సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాలు వాడడం వల్ల వాతావరణ, నీటి కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అనసూర్య పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు.
కోర్టు కేసులతో అభివృద్ధిని అడ్డుకోవద్దు
హుజూర్‌నగర్/గరిడేపల్లి, వెలుగు : కోర్టు కేసులతో గ్రామాభివృద్ధిని అడ్డుకోవద్దని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలిచిన గ్రామాల్లో తీర్మానాలు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధికి కలిసిరావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, గరిడేపల్లి మండలానికి చెందిన పలువురికి సోమవారం పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెన్షన్ తీసుకునేవారంతా ప్రభుత్వ ఉద్యోగులే అన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ కనుమరుగవుతోందన్నారు. పెన్షన్ తీసుకున్న ప్రతిఒక్కరూ మూడు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, ఎంపీటీసీలు విజయలక్ష్మి, ముడెం గోపిరెడ్డి పాల్గొన్నారు.
తల్లిదండ్రులు చనిపోయారన్న బాధతో యువతి ఆత్మహత్య
సూర్యాపేట, వెలుగు: తల్లిదండ్రులు చనిపోయారన్న బాధతో ఓ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటలోని అన్నాదురైనగర్‌కు చెందిన సంతోషి (20) దివ్యాంగురాలు. ఇటీవల వివిధ కారణాలతో తల్లిదండ్రులు చనిపోవడంతో కొన్ని రోజులుగా తన చెల్లి వద్ద ఉంటుంది. తల్లిదండ్రులు చనిపోయారన్న బాధతో పాటు ఆరోగ్య సమస్యలతో ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఆమెను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన సంతోషి సద్దల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కార్డుల పంపిణీ విషయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ లీడర్ల ఘర్షణ
సూర్యాపేట, వెలుగు : టీఆర్‌ఎస్ లీడర్లు ప్రొటోకాల్ పాటించకుండా పింఛన్ కార్డులు మంజూరు చేస్తున్నారంటూ వారిపై కాంగ్రెస్ కౌన్సిలర్ దాడి చేశారు. ఈ ఘటన సూర్యాపేటలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని 37వ వార్డుకు చెందిన పలువురికి మంజూరైన పింఛన్ కార్డులను స్థానిక కౌన్సిలర్‌కు సమాచారం ఇవ్వకుండా టీఆర్‌ఎస్ నాయకుడు అనంతుల దుర్గాప్రసాద్ ఆదివారం పంపిణీ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ బైరు శైలేంధర్ నిలదీయడంతో రెండు పార్టీల లీడర్లు కలిసి కార్డులను సోమవారం పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే సోమవారం అనుకున్న టైంకు టీఆర్‌ఎస్ లీడర్లు రాకుండా మరోచోట కార్డుల పంపిణీ ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ అక్కడికి చేరుకొని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి కొట్టుకోవడంతో దుర్గాప్రసాద్‌కు గాయాలు అయ్యాయి. అతడిని ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు తరలించారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
మిర్యాలగూడ, వెలుగు : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మిర్యాలగూడ, నల్గొండ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, వేములపల్లి మండలాల్లో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు పుట్టల సునీత, పోకల శ్రీవిద్య, లీడర్లు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, కరుణాకరెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
యాదగిరిగుట్ట, వెలుగు : వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, భజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షుడు కోకల సందీప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తూ, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. మునావర్ షోకు పర్మిషన్ ఇవ్వడం, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ పెట్టడం సరికాదన్నారు.
ధరణితో రిజిస్ట్రేషన్లు ఈజీ
యాదాద్రి, వెలుగు : ధరణితో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఈజీ అవుతుందని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. భారత దర్శినిలో భాగంగా ఒడిశాకు చెందిన డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లకు సోమవారం నిర్వహించిన ట్రైనింగ్‌లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ధరణిలోని 33 మాడ్యూల్ సేవలు, 10 సమాచార మాడ్యూల్ సేవల గురించి వివరించారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలు, నాలా మార్పు, వారసత్వ భూముల కొనుగోలు, అమ్మకాలు పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతాయన్నారు. పట్టాదార్ ప్రమేయం లేకుండా ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశం లేదని, ఎన్‌ఆర్‌ఐలకు కూడా కొనుగోలు, అమ్మకాలు జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు. ట్రైనింగ్‌లో అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీనివాస్, వడ్ల శ్రీనివాస్ ఉన్నారు.
ప్రతి మండలానికి 100 మట్టి గణపతుల పంపిణీ
జిల్లాలోని ప్రతి మండలానికి 100 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు, కలెక్టరేట్‌కు వచ్చిన సందర్శకులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య, డీఏవో అనురాధ, హార్టికల్చర్ ఆఫీసర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. అనంతరం ప్రజవాణికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అలాగే నులిపురుగుల నివారణలో కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. 19 ఏండ్ల లోపున్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందించాలని సూచించారు. మీటింగ్‌లో డీఎంహెచ్‌వో మల్లికార్జునరావు, సూపరింటెండెంట్ చిన్నానాయక్, డీఈవో నారాయణరెడ్డి, డీప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
యాదాద్రి, వెలుగు : ధరణితో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఈజీ అవుతుందని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. భారత దర్శినిలో భాగంగా ఒడిశాకు చెందిన డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లకు సోమవారం నిర్వహించిన ట్రైనింగ్‌లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ధరణిలోని 33 మాడ్యూల్ సేవలు, 10 సమాచార మాడ్యూల్ సేవల గురించి వివరించారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలు, నాలా మార్పు, వారసత్వ భూముల కొనుగోలు, అమ్మకాలు పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతాయన్నారు. పట్టాదార్ ప్రమేయం లేకుండా ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశం లేదని, ఎన్‌ఆర్‌ఐలకు కూడా కొనుగోలు, అమ్మకాలు జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు. ట్రైనింగ్‌లో అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీనివాస్, వడ్ల శ్రీనివాస్ ఉన్నారు.
బతుకమ్మ చీరలు నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేయండి
సూర్యాపేట, వెలుగు : బతుకమ్మ చీరలను భద్రపరిచేందుకు అగ్రికల్చర్ మార్కెట్ గోడౌన్లలో ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ యస్. మోహన్‌రావు ఆదేశించారు. బతుకమ్మ చీరల పంపిణీ, గోడౌన్లలో నిల్వలపై సోమవారం ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. త్వరలోనే బతుకమ్మ చీరలు జిల్లాకు చేరుకోనున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాలు నిండి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు చీర అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో సురేశ్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, వెంకారెడ్డి, డీపీవో యాదయ్య, మార్కెటింగ్ అధికారి సంతోశ్, డీఎం రాంపతి, ఏఏస్‌వో పుల్లయ్య పాల్గొన్నారు.
వడ్డెర ఫెడరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలి
మునుగోడు, వెలుగు : వడ్డెర ఫెడరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసి 80 శాతం సబ్సిడీతో లోన్లు ఇవ్వాలని వడ్డెర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లపు సమ్మయ్య కోరారు. నల్గొండ జిల్లా మునుగోడులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డెర్లను ఎస్టీలో కలపడంతో పాటు, వడ్డెర బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మునుగోడులో టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. కులవృత్తి చేస్తూ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 20 లక్షలు, వికలాంగులు అయితే రూ. 10 లక్షలు చెల్లించాలని కోరారు. వడ్డెర సంఘం అధ్యక్షుడు ధ్యారంగుల నగేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లపు రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఇరుగదిండ్ల ఇదయ్య, మహిళా అధ్యక్షురాలు శివరాత్రి లక్ష్మమ్మ, యూత్ ఉపాధ్యక్షుడు సాయికుమార్, రాష్ట్ర కార్యదర్శి సుకృత్ పాల్గొన్నారు.
యాదాద్రిలో తహసీల్దార్ల బదిలీ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఆర్డర్స్ జారీ చేశారు. గుండాల తహసీల్దార్ శ్రీనివాసరాజును సంస్థాన్ నారాయణపురానికి, నారాయణపూర్, ఆలేరు తహసీల్దార్లు రవికుమార్, డి.గణేశ్‌ను కలెక్టర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అడ్డగూడూరు తహసీల్దార్ పి.రామకృష్ణ ఆలేరుకు ట్రాన్స్‌ఫర్ కాగా, కలెక్టరేట్ సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న జి.దశరథ అడ్డగూడూరుకు, జి.జ్యోతి గుండాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అలాగే ఆలేరు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్‌రెడ్డిని రాజాపేటకు, రాజాపేట డీటీ శివగణేశ్‌ను యాదగిరిగుట్టకు, భువనగిరి డీటీ గులాం ఇద్రిస్‌ను ఆలేరుకు ట్రాన్స్‌ఫర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.