ఆకలిని తీర్చేందుకు బల్దియా వ్యూహాలు
మొన్న రూ.5 మీల్స్.. ఈరోజు ఫీడ్ ది నీడ్
హైటెక్ సిటీలో మంచి రెస్పాన్స్
హోటల్స్ నుంచి స్పందన కరువే
బిర్యాని, పండ్లు, టిఫిన్స్ తెస్తున్నారు
డైలీ ఉత్పత్తి అవుతున్న చెత్తలో 15 శాతం ఆహారమే
త్వరలోనే మరిన్ని ఫీడ్ ది నీడ్ కేంద్రాలు
నగరంలో ఆకలికేకలు వినిపించకూడదన్న.. బల్దియా వ్యూహాలు సత్పలితాలిస్తున్నాయి. మొన్న ఐదురూపాయిల మీల్స్… ఈరోజు ఫీడ్ ది నీడ్. పేరేదైనా.. ఫైనల్ గా ఆకలితో అలమటించకూడదన్న లక్ష్యంతో ముందుకు పోతుంది జిహెచ్ఎంసి. ఫీడ్ ది నీడ్ కాన్సెప్ట్ కు రోజురోజుకి రెస్పాన్స్ పెరుగుతుంది. సిటీలో మరిన్ని ఫీడ్ ది నీడ్ ఫ్రిజ్ లు రావాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్.
హైదరాబాద్ మహానగరంలో ఆకలితో అలమటించేవారి.. ఆకలిని తీరుస్తుంది 5 రూపాయిల భోజన పథకం. కేవలం 5 రూపాయిలే కావడంతో… సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ… రోజూ సుమారు 40 వేల మంది ఆకలిని తీరుస్తుంది. ఇప్పుడు బల్దియా.. మరో కొత్త ప్రయోగం చేసింది. ఫీడ్ ది నీడ్ అన్న పేరుతో.. నిరుపేదల ఆకలిని తీరుస్తుంది. మరోవైపు ఫుడ్ వేస్ట్ కాకుండా.. బల్దియా ప్లాన్ చేస్తుంది. సిటీలో రోజూ విడుదలవుతున్న చెత్తలో 15 శాతం ఆహార పదార్ధాలే ఉంటున్నాయి.
సహజంగా.. ఇంట్లో, హోటల్లోనో ఫుడ్ ఎక్కువైపోతుంటుంది. ఎక్కువైన ఫుడ్ ను పాడేయడం కూడా అంతే కామన్ గా జరుగుతుంది. ఫంక్షన్స్, హోటల్స్ లో టన్నుల కొద్దీ ఫుడ్ డస్ట్ బిన్ లోకి చేరుతుంది. ఎక్కడో కానీ.. మిగిలిన ఫుడ్ ఆశ్రమాలు, నిరుపేదలకు అందడం లేదు. దీంతో ఫుడ్ వేస్టేజ్ ను అరికడుతూనే.. ఆకలితో ఉన్న వారి కడుపును నింపేదే ఈ ఫీడ్ ది నీడ్.
కొన్ని రోజుల క్రితం.. హైటెక్ సిటీ శిల్పారామం ఆపోజిట్లో ఎన్జీవో సాయంతో ఫీడ్ ది నీడ్ ఫ్రిజ్ ను ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసి. హైటెక్ సిటీలోని హోటల్స్, ఇళ్లు, కంపెనీ క్యాంటీన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. రోజూ వృధ్దా అవుతున్న ఆహారాన్ని.. ప్యాక్ చేసి ఫ్రిజ్ లో పెడుతున్నారు. వాటిని.. అవసరమైన వారు తీస్కుని తినవచ్చు.
పళ్లు, బిర్యానీ, కర్రీలు, టిఫిన్స్, రైస్, పాల ఉత్పత్తులు.. ఇలా అన్నిరకాల ఆహారాన్ని ఫ్రిజ్ లో పెడుతున్నారు. ఎక్కువగా ఆఫీసుల్లో ఉండే క్యాటీన్స్, హోటల్స్ లో మిగిలిన ఫుడ్ ను తెచ్చి పెడుతున్నారు. ఇక వీటిని హైటెక్ సిటీలో కూలి పని చేస్తున్నవారు తింటున్నారు. గార్డెనింగ్, రోడ్ సైడ్ పనిచేసేవారు, బెగ్గర్సే కాకుండా.. సాధారణ జనం కూడా వీటిని తింటున్నారు.