ఫోన్ హీటయితుందా... ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఫోన్ హీటయితుందా... ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడందరి చేతుల్లో తప్పనిసరి అయిపోయాయి. చిన్న చిన్న పనుల నుండి ఆర్థిక లావాదేవీల వరకూ అన్ని ఫోన్లోనే అయిపోతున్నాయి. అయితే... ఎక్కువ వాడటం వల్ల అవి కాస్తా.. బాగా హీటయిపోతున్నాయి. ఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఈ సమస్యను ఫేస్ చేసి ఉంటారు. ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసి.. కొన్ని టిప్స్ ఫాలో అయితే.. ఈ సమస్య నుండి గట్టెక్కచ్చు.

ఫోన్ హీటవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి:

• ఎట్టి పరిస్థితులో డూప్లికేట్ ఛార్జర్లు, కేబుల్స్ వాడకండి. ఇలా చేస్తే ఫోన్ తొందరగా వేడెక్కుతుంది.

• ప్రతీసారి కంపెనీ ప్రొవైడ్ చేసిన చార్జర్ మాత్రమే వాడండి. 

• ఎప్పుడు చార్జింగ్ పెట్టినా.. బ్యాటరీ పూర్తిగా నిండేలా చూసుకోండి. మళ్లీ బ్యాటరీ పూర్తిగా అయిపోకముందే చార్జింగ్ పెట్టండి.

• స్విచ్ఆఫ్ అయ్యే వరకు మొబైల్ అస్సలు వాడొద్దు. 

• బ్యాక్ గ్రౌండ్లో యాడ్స్ రన్  కాకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని అఫ్ చేసేయండి.. అవసరం ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. 

• డిస్ప్లే లైట్ చాలా తక్కువగా పెట్టుకోండి. లేదంటే ఆటోమేటిక్ మోడ్లో పెట్టుకోండి.

• జంక్ ఫైల్స్ అనవసర ఫైల్స్, ఏపీకే ఫైల్స్, ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి. ఈ చిట్కాలు పాటిస్తే మీ మొబైల్ హీట్ సమస్య నుండి తప్పించుకోవచ్చు.