వరల్డ్ కప్లో సెంచరీ చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు ఆర్క్ గ్రూప్ సత్కారం

వరల్డ్ కప్లో సెంచరీ చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు ఆర్క్ గ్రూప్ సత్కారం

అండర్ -19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా విజయంలో  కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిషను ఆర్క్ ఫౌండేషన్ సన్మానించింది. అండర్ -19 టీ20 ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి.. ప్లేయర్ ఆప్ ది టోర్నమెంట్ గా నలవడంపై ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. 

 కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పుల్లెల గోపీ చంద్, మాజీ క్రికెటర్ ఎం ఎస్ కె ప్రసాద్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి  తదితరులు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన త్రిష.. దేశం గర్వించేలా ప్రదర్శన చేసిందని ప్రముఖులు కొనియాడారు. 

Also Read :- ఇండియా-పాకిస్థాన్ సమరం..మ్యాచ్ అఫీషియల్స్‌‌ను ప్రకటించిన ఐసీసీ

గొంగడి త్రిషకు తాము స్పాన్సర్ చేయడం గర్వకారణంగా ఉందని ఆర్క్ గ్రూప్ పేర్కొంది.  గత 6 సంవత్సరాలుగా త్రిష కు ARK గ్రూప్ సంస్థ స్పాన్సర్ చేస్తూ వస్తోంది.

అండర్ 19 టీ20 టోర్నమెంట్ లో మొత్తం ఏడు మ్యాచ్‌‌ల్లో ఒక సెంచరీతో 309 రన్స్‌‌ చేసి.. ఏడు వికెట్లు పడగొట్టిన త్రిష పెర్ఫామెన్స్‌‌ ఈ టోర్నీకే ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే..