
దేశరాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. దుమ్ము తుఫాన్ దాటికి వందలాది ఫ్లైట్స్ ఇప్పటికే ఆలస్యంగా నడుస్తున్నాయి.కొన్ని ఫ్లైట్స్ ను దారి మళ్లించగా..పలు విమానాలను రద్దు చేశారు.
ఈ దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీ- ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షంతో కూడిన భారీ దుమ్ము తుఫాను సంభవించింది. దీని వలన అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దేశ రాజధాని అంతటా చెట్లు కూలిపోయాయి. దుమ్ము తుఫాన్ ఇళ్లను చుట్టుముట్టింది.
ఓ వ్యక్తి తుపాను భూకంపంలా అనిపించిందని..తన ఇంట్లో లైట్లు,ఫ్యాన్లు ఊగుతున్నాయని ఓ వీడియో పోస్ట్ చేశాడు. మా అపార్ట్ మెంట్ షేక్ అవుతున్నట్లు అనిపించింది. 20వ అంతస్థులోని ఎన్ సీఆర్ లో లైట్లు ఊగుతున్నాయి. చాలా భయంకరంగా దుమ్ముతుఫాన్ వస్తుంది. 20 నిమిషాలు భూకంపం వచ్చినట్లు అనిపించింది. నాకు వాంతులు వస్తున్నాయి. ఏం చేయాలో ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పాడు.
ఐఎండీ ప్రకారం దుమ్ము తుఫాన్ IGI విమానాశ్రయం దగ్గర గంటకు 74 కి.మీ.. ప్రగతి మైదాన్ లో గంటకు 70 కి.మీ., లోధి రోడ్ లో గంటకు 69 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. నజాఫ్‌గఢ్‌లో గాలి వేగం గంటకు 37 కి.మీ. నుంచి సఫ్దర్ జంగ్‌లో 56 కి.మీ. వరకు ఉంది.
Dust storm in Gurgaon. It was like apocalypse.pic.twitter.com/f6I1HjaH0s
— Tarun 𝕏 (@AsTarunTweets) April 11, 2025