హైదరాబాద్, వెలుగు: మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆమె పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ జితేందర్‌కు తన జాయినింగ్ రిపోర్ట్‌ను అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్, ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు.
ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో స్పోర్ట్స్ కోటా కింద నిఖత్ జరీన్‌ను డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆమె డీఎస్పీ (స్పెషల్ పోలీస్)గా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసింది.